PM Modi key comments in Begumpet sabha fire on trs: నేను బీజేపీలో చిన్న కార్యకర్తనేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బేగంపేట విమానాశ్రయంలో నిర్వహించిన పబ్లిక్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ‘‘రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ జాతికి అంకితం చేయడంతో పాటు పలు జాతీయ రహదారుల ప్రారంభానికి వచ్చాను. నాకు బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో బీజేపీ కార్యకర్తలను కలవాలని కోరారు. అందుకే నేను వచ్చాను. తెలంగాణ ప్రజలు ఇక్కడి అవినీతి, కుటుంబ పాలనపై అర్జునుల్లా ప్రజలు పోరాడుతున్నారు. బీజేపీ కార్యకర్తలు ఎవరికీ తల వంచకుండా పోరాడుతున్నారు తెలంగాణ ప్రజలు వెనుకబడ్డారు.. కానీ ఒక్క కుటుంబం మాత్రం బాగుపడింది. తెలంగాణ ప్రజలు ఆలోచనా పరులు ఆలోచించాలి. తెలంగాణ ప్రజలు మునుగోడు తో మాకు మరింత భరోసా ఇచ్చారు.. వారిపై మాకు విశ్వాసం ఉంది.
నలువైపులా చీకట్లు కమ్ముకున్న తెలంగాణను వికాసంలో ముందు వరుసలో పెడతాం. ప్రజల బతుకుల్లో చీకట్లను దూరం చేసే రోజు వచ్చింది. మునుగోడు లో అది రుజువు అయింది. భవిష్యత్ లో కమలం వికసిస్తుంది. బీజేపీ కార్యకర్తలు మొత్తం తెలంగాణ ప్రభుత్వాన్ని మునుగోడులో మోకారిల్లేలా చేసింది. మీ కృషి అసాధారణం. తెలంగాణలో సూర్యోదయానికి సమయం దగ్గర్లోనే ఉంది. 1985 లో మా పార్టీకి రెండు లోక్ సభ స్థానాలు మాత్రమే ఉండేవి. కానీ ప్రజలు మా వెంటే ఉండి మాకు అధికారం ఇచ్చారు. మేము కష్టాల్లో ఉన్నా తెలంగాణ ప్రజలు మాపై ప్రేమను చూపారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం మా బాధ్యత తెలంగాణ సర్కార్‌కు గుడ్డి నమ్మకాలు ఎక్కువైపోయాయి. దీనివల్ల ఏమేం జరుగుతుందో ఇక్కడి ప్రజలు, దేశమంతా చూడాలి. ఈ అంధ విశ్వాసాన్ని దూరం చేయాలి. అందుకు అంతా మాకు తోడుగా రండి. తెలంగాణ మొత్తం ఒక కుటుంబంలా మా వెంట రండి.
బీజేపీకి కుటుంబం ముఖ్యం కాదు.. ప్రజలు ముఖ్యం. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి కేసీఆర్ కుటుంబం పై తెలంగాణ ప్రజలు, యువత, సబ్బండ వర్గాల ప్రజలు మొత్తం వ్యతిరేకంగా ఉన్నారు. పేదలను నమ్మించి మోసం చేసే వారిని ఊరికే వదిలిపెట్టబోము. అవినీతి, కుటుంబ పాలన వల్ల జరుగుతున్న నష్టాన్ని తెలంగాణ, దేశ ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అవినీతిని రూపుమాపేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. మధ్యవర్తుల చేతుల్లోకి డబ్బులు పోవద్దని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నాం. అంతేకాకుండా ఆన్ లైన్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహిస్తున్నాం. ఎందుకంటే అవినీతి అంతమొందించేందుకు తెలంగాణ బీజేపీ కార్యకర్తలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. ఇతరులు మోడీని విమర్శలు చేస్తారు.. వారిలో నిరాశ, నిస్పృహలు నిండి అలా చేస్తారు. కానీ మీరు పరేషాన్ కావొద్దు. వారు విమర్శలు, తిట్టేందుకు చేసేందుకే కొందరిని ప్రత్యేకంగా నియమించుకున్నారు. సాయంత్రం చాయ్ తాగి ఆ విమర్శలను, తిట్లను మరిచిపోండి. తిరిగి తెల్లారి ప్రజల్లో ఉండండి.. వారే మీకు రాజ్యాధికారం అందిస్తారు.
నేను ఒక్కో టైమ్‌కి ఒక్కో దగ్గర ఉంటాను అందరూ నన్ను తిట్టుకుంటారు. నేను ప్రతిరోజూ కిలోల కొద్దీ తిట్లు తింటాను. ఆ తిట్లే నాకు న్యూట్రిషన్‌గా పని చేస్తాయి. కొత్తకొత్త తిట్లు వెతుకుతారు. మీరెన్ని తిట్టినా పట్టించుకోవద్దు. తిడితే అభివృద్ధి సాధ్యమవుతుందా అనే విషయాన్ని ఇతర పార్టీలు గుర్తుంచుకోవాలి. బీజేపీని తిట్టండి.. కానీ తెలంగాణా ప్రజలను తిడితే మాత్రం నీ వెంబడి పడుతాం. నీ పరిస్థితి ఎంతలా దిగజరుతుందో ఉహించుకోలేరు బీజేపీని, మోడీని తిట్టండి కానీ ప్రజలను మాత్రం ఏమైనా అంటే ఉరుకొం. తెలంగాణలో బీజేపీ సరికొత్త మార్పు కోసం చాలా పాజిటివ్‌గా వస్తున్నాం. ఇది హిందూస్థాన్ కోసం టర్నింగ్ పాయింట్‌గా మారనుంది. కేంద్రం దేశంలోని పేదలకు నిత్యం పథకాలు చేరువ చేస్తున్నాం.
తెలంగాణలో 2 కోట్ల మంది లబ్ధిదారులకు రేషన్ అందుతోంది. పీఎం అవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా ఇండ్లు లేని వారికి ఇండ్లు అందిస్తున్నాం. కానీ తెలంగాణా సర్కార్ దీన్ని అడ్డుకుంటోంది. ప్రజలు.. ఈ పరిస్థితి మారుతుంది.. బీజేపీ వచ్చి మారుస్తుంది. ప్రజల సంక్షేమం కోసం మా కార్యకర్తలు తీవ్రంగా పోరాడుతున్నారు. ఒక్కసారి మా సర్కార్ అధికారంలోకి వస్తే మా పాలన చూశాక ప్రతిసారి మీరే అధికారంలోకి తీసుకొస్తారు. బీజేపీ యువకుల పార్టీ తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలనకు విముక్తి కలిగిస్తాం. నాకు మా కార్యకర్తలపై నమ్మకం ఉంది.’’అని మోడీ (PM Modi) పేర్కొన్నారు.
ఈ కర్యక్రమంలో బీజేపీ నేతలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ,మాజీ ఎంపీలు బూర, జితేందర్ రెడ్డి, విజయశాంతి, కొండా విశ్వేశ్వర రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఎమ్మెల్యే రఘునందన్ రావుమాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ఎస్ ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి, నల్లు ఇంద్రసేనా రెడ్డి, మురళీధర్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రా రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు