రవితేజ సినిమా నుంచి సరికొత్త అప్ డేట్..!!

రవితేజ సినిమా నుంచి సరికొత్త అప్ డేట్..!!

0
86

సెకండ్ ఇన్నింగ్స్ లో కాస్త వెనుకపడ్డ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం డిస్కో రాజా.. సైంటిఫిక్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రానికి విఐ ఆనంద్ దర్శకుడు.. ఇటీవలే రిలీజ్ అయినా ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన వస్తోంది.అయితే చిత్రయూనిట్ అక్టోబర్ 19న డిస్కో రాజా మ్యూజిక్ ఆల్బమ్ నుంచి తొలి పాటను విడుదల చేయనుంది.

థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రం లో మాస్ మహారాజ రవితేజ కు జోడీగా పాయల్ రాజ్ పుత్.. నభ నటేష్.. తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.