ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు కలిశారా అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ మంత్రి బొత్స సత్యనారాయణ. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…
గతంలో హీరో అక్కినేని నాగార్జున అలాగే మోహన్ బాబులు కలిశారని తెలిపారు… జగన్ సీఎం అయిన తర్వాత ఇంతవరకు ఇండ్రస్టీకి చెందిన ప్రముఖులు ఎవ్వరు కలవలేదన్న ప్రశ్నకు ఆయన బదులిచ్చారు… ఇండస్ట్రీలో జగన్ మోహన్ రెడ్డిని కలవడమంటే బాలకృష్ణ వచ్చి జగన్ ని కలవాలా అని బొత్స ప్రశ్నించారు…
సినిమా ఇండస్ట్రీ అంటే బాలకృష్ణ ఒక్కడేనా అని అన్నారు… గతంలో నాగార్జున మోహన్ బాబులు కలిసిన విధంగానే త్వరలో మెగాస్టార్ చింజీవి కూడా కలవనున్నారని తెలిపారు…