Lovers suicide: ప్రేమ జంట ఆత్మహత్య

-

Lovers suicide at addanki in Bapatla district: వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. కలిసి జీవించాలని అనుకున్నారు. ప్రేమ విషయం ఇంట్లో చెప్తే.. ఒప్పుకోరని భయపడ్డారో, పెళ్లి చేయరని అనుమానం పెంచుకున్నారో ఏమో ప్రాణాలు తీసుకునేందుకు నిశ్చయించుకున్నారు. కలిసి ఎలాగూ బతకలేము.. కలిసైనా చనిపోదామనుకొని, ఒకే చెట్టుకు ఒకే చున్నీతో ఇద్దరూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడి, ఇరు కుటుంబాల్లో వేదన మిగిల్చారు. ఈ విషాదకర ఘటన అద్దంకి పట్టణంలోని గరటయ్య కాలనీ సమీపంలోని కాకాని కుంట వద్ద చోటు చేసుకుంది.

- Advertisement -

ప్రేమికులు ఆత్మహత్య (Lovers suicide) చేసుకున్నారని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు. విచారణలో మృతులిద్దరూ అద్దంకి పట్టణానికి చెందిన వారేననీ.. పెద్దిరాజు (22) ప్రశాంతి (20)గా పోలీసులు గుర్తించారు. ఇద్దరూ చనిపోవటానికి ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు అనుకుంటున్నారు. అయితే ప్రేమ వ్యవహారమేనా, మరే ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రయోజకులు అవుతారనుకున్న పిల్లలు ఇలా విగత జీవులుగా చెట్టుకు వేలాడటం చూసి.. ఇరు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...