White Hair Treatment follow these homemade tips for white hair turn to black color: పూర్వం వయస్సు పైబడిన వారికి మాత్రమే తెల్లవెంట్రుకలు కనిపించేవి. కానీ ఈమధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా టీనేజర్లను కూడా వైట్ హెయిర్ సమస్య వేధిస్తోంది. ఈ జుట్టు తెల్లబడటానికి రకరకాల కారణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జన్యుపరమైన కారణాలు కొన్ని అయితే, పోషకాహార లోపం, హెయిర్ స్టైల్స్ కోసం వాడే రకరకాల రసాయనాలు, ఇలా అనేక కారణాలు ఉండొచ్చు.
అయితే జుట్టు తెల్లబడే సమస్య నుండి బయటపడాలంటే మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. తరచూ జుట్టును దృఢపరచే పోషకాహారం తీసుకోవాలి. టైమ్ టు టైమ్ ఫుడ్ తీసుకోవాలి. రాత్రిళ్ళు ఎక్కువసేపు మేల్కొని ఉండకుండా, త్వరగా నిద్రపోవాలి. శరీరానికి కావాల్సినంత నిద్రపోవాలి. వీటితోపాటు ఈ వంటింటి చిట్కాలు కూడా ట్రై చేస్తే తెల్లజుట్టు సమస్యను దూరం చేయొచ్చు. ఎలాంటి రసాయనాలు, సైడ్ ఎఫెక్స్ లేకుండా ప్రకృతి ప్రసాదించిన వనరులతోనే తెల్లవెంట్రుకలను తొలగించుకోవచ్చు.
బ్లాక్ టీ: తెల్ల వెంట్రుకలకు బ్లాక్ టీ మంచి రెమెడీ. పాలు కలపకుండా కప్పు బ్లాక్ టీ తీసుకొని, అందులో టేబుల్ స్పూన్ ఉప్పు వేసి, కలపండి. దాన్ని గోరువెచ్చగా వేడిచేసి, దాన్ని తలకు పట్టించి, నెమ్మదిగా మసాజ్ చేయండి. టీ మీ తల మొదలు వరకూ వెళ్లాలి. అలా సుమారు అరగంట సేపు టీని తలకే ఉంచండి. ఆ తర్వాత షాంపూతో తలను శుభ్రం చేసుకోండి. రోజూ ఇలా చేస్తే ఈ (Hair Treatment)తో తప్పకుండా తెల్ల వెంట్రుకల సమస్య తీరుతుంది.
ఉసిరి, కొబ్బరినూనె: ఉసిరికాయ ముక్కలు కలిపి ఉడికించిన కొబ్బరినూనె రోజూ రాసుకుంటే తెల్ల వెంట్రుకల సమస్యే ఉండదు. ఎండిన ఉసిరి కాయలను కొబ్బరినూనెలో వేసి, కాసేపు వేడి చేయండి. రాత్రంతా ఉసిరి కొబ్బరినూనె మిశ్రమాన్ని అలాగే వదిలేయండి. ఉదయం ఆ నూనెను వడకట్టి ఒక గాజు సీసాలో స్టోర్ చేసి తరచూ తలకు రాసుకోండి.
గోరింటాకు: గోరింటాకు పొడి లేదా హెన్నాలో కాస్త పెరుగు, ధనియాలు, మెంతులు, కాఫీ, తులసి రసం, పుదీనా రసం కలపండి. వాటిని సుమారు 15 నిమిషాలు ఉడికించండి. రాత్రంతా ఆ మిశ్రమాన్ని అలాగే వదిలిపెట్టి, ఉదయం తలకు రాసుకోండి. గంటసేపు ఆరిన తర్వాత తలను నీటితో శుభ్రం చేసుకోండి. తరచూ ఇలా చేయడంవలన తెల్లవెంట్రుకలు రాకుండా జుట్టును సంరక్షించుకోవచ్చు.
గమనిక: వీటిలో మీ శరీరతత్వానికి పడని పదార్ధం ఏదైనా ఉంటే ఈ టిప్స్ పాటించకపోవడం ఉత్తమం.