Senior Resident Vacancies in Ap: ఏపీ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (ఏపీడీఎంఈ) పరిధిలో ఉన్నా.. గవర్నమెంట్ మెడికల్, డెంటల్ మెడికల్ కాలేజీల్లో 49 స్పెషాలిటీల్లో 1,458 సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
సీనియర్ రెసిడెంట్ పోస్టులు – 1,458
మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి, ఏపీ ప్రభుత్వ మెడికల్ అండ్ డెంటల్ కాలేజీలో పీజీ చదివిన స్థానిక అభ్యర్థులై ఉండాలి. కాగా.. వయసు 45 ఏళ్లకు మించరాదు. నెలకు రెసిడెంట్ సూపర్ స్పెషలిస్ట్‌లకు రూ. 85,000, రెసిడెంట్ స్పెషలిస్ట్ డిగ్రీ రూ. 70,000, రెసిడెంట్ డెంటిస్ట్ రూ. 65,000 ఉంటుంది. అయితే.. ఎంపిక విధానం అనేది.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఎగ్జామ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్.. ఆధారంగా (Senior Resident)కు ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 19, 2022. వెబ్‌సైట్: https://dme.ap.nic.in