Husband kills Wife: భార్యను చంపేసి.. నివాళులర్పించిన భర్త!

-

Husband kills Wife because refusing sell land At Tenali in Guntur district: భార్యను అతి కిరాతకంగా చంపేసి.. అనంతరం తన వెంట తెచ్చిన పూలమాలను భార్య మృతదేహంపై ఉంచి నివాళుల్పించాడో భర్త. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. తెనాలిలో గాంధీ నగర్‌కు చెందిన కోటేశ్వరరావు (35)కి కొన్ని సంవత్సరాల క్రితం స్వాతి (31) అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉండగా.. స్వాతి బ్యూటీపార్లర్‌ నడుపుతూ భర్తకు సాయంగా ఉంటుంది. మెుదట అంతా సవ్యంగా ఉన్నా.. క్రమంగా కోటేశ్వరరావు చెడు అలవాట్లకు బానిస కావటంతో కుటుంబంలో చిచ్చు రేగింది. వ్యసనాల కోసం దొరికిన చోటల్లా అప్పులు చేయటం ప్రారంభించాడు.

- Advertisement -

ఈ బాకీలు భారీగా పెరిగిపోవటంతో.. భార్య పేరు మీద ఉన్న స్థలాన్ని అమ్మేసి.. అప్పులు తీర్చేందుకు కోటేశ్వరరావు నిర్ణయించుకున్నాడు. అయితే స్థలం అమ్మేందుకు స్వాతి నిరాకరించటంతో.. ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో గురువారం కూడా స్థలం అమ్మాలని.. భార్యపై ఒత్తిడి తెచ్చాడు. అయినప్పటికీ స్వాతి ఒప్పుకోలేదు.. స్థలం అమ్మనని ఖారాఖండీగా చెప్పేసి.. బ్యూటీ పార్లర్‌కు స్వాతి వెళ్లిపోయింది. దీంతో నేరుగా భార్య నిర్వహిస్తున్న బ్యూటీ పార్లర్‌కు వెళ్లి.. కత్తితో స్వాతి తలను నరికేశాడు  అనంతరం తన వెంట తెచ్చుకున్న పూలదండలను వేసి.. అక్కడ నుంచి వెళ్లిపోయాడు. భార్యను చంపిన (Husband kills Wife ) అనంతరం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి కోటేశ్వరరావు లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకొని, సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...