central minister Prahlad Joshi clarity on Singareni Privatization:సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వ్యాఖ్యలు చేశారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎక్కువనీ.. కేంద్ర వాటా తక్కువని స్పష్టం చేశారు. సింగరేణిపై ఏ నిర్ణయం తీసుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని పేర్కొన్నారు. సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరణ చేస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అబద్ధాలు చెప్పి కేసీఆర్ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. కాగా గత కొన్ని రోజులుగా సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా కేంద్రమంత్రి ప్రకటనపై, తెలంగాణ సర్కారు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.