Murder Attempt on lecturer at college in Anantapur: లెక్చర్‌గా విధులు నిర్వర్తిస్తున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. అంతమెుందించేందుకు ప్రణాళిక రచించుకున్నాడు. ఏకంగా కాలేజీలోకే వెళ్లి.. గొంతుకోసి తీవ్రంగా గాయపరచాడు. ఈ దారుణమైన ఘటన అనంతపురం జిల్లా ఆర్ట్స్ కళాశాలలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సుమంగళి, పరేష్ భార్యాభర్తలు. వీరిద్దరూ అనంతపురం నగరంలో నివసించే వారు. గత 20 ఏళ్లుగా గుంటూరులో లెక్చరర్‌గా పని చేసిన సుమంగళి, ఏడాది క్రితమే జిల్లా ఆర్ట్స్ కళాశాలకు బదిలీపై వచ్చారు. కాగా, భార్య సుమంగళిపై అనుమానంతో పరేష్ ప్రతిరోజూ వేధిస్తూ ఉండటంతో.. గత కొన్ని రోజులుగా భర్తకు దూరంగా శ్రీనివాస్ నగర్‌లో సుమంగళి నివసిస్తోంది.
దీంతో మరింత కోపం పెంచుకున్న పరేష్, భార్యను చంపేందుకు(Murder Attempt) నిశ్చయించుకున్నాడు. ఈ నేపథ్యంలో, కళాశాలలో ప్రిన్సిపల్ రూమ్‌లో సుమంగళి థంబ్ వేసి.. వస్తుండగా.. పరేష్ ఆమెపై కత్తి దాడి చేసి.. గొంతు కోశాడు. అక్కడే ఉన్న విద్యార్థులు పరేష్‌ను అడ్డుకోవటంతో.. వారి నుంచి తప్పించుకొని అక్కడ నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడుని త్వరలోనే పట్టుకుంటామని పోలీసుల పేర్కొన్నారు.