NV Subhash: కేసీఆర్‌ అలా చెప్పటం జోక్‌ ఆఫ్‌ ది సెంచరీ

-

bjp leader NV Subhash fires on Telangana CM KCR: కేసీఆర్‌ తన కూతురు కవితను బీజేపీ కొనాలని చూసిందని చెప్పటం హస్యాస్పదమనీ.. అది జోక్‌ ఆఫ్‌ ది సెంచరీ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌ అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఎన్వీ సుభాష్‌ ఓ పత్రిక ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణ రాబందుల సమితి నేతలకు పిచ్చి పట్టిందనీ.. మతిభ్రమించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎన్వీ సుభాష్‌ మండిపడ్డారు. అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ టీఆర్‌ఎస్‌ అని అన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు నిజాయితీపరులు, సత్యహరిశ్చంద్రులు అయితే.. మాతో చర్చకు రావాలనీ.. ఆధారాలతో సహా టీఆర్‌ఎస్‌ నేతల అవినీతిని నిరూపిస్తామని ఎన్వీ సుభాష్‌ సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ మాయమాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరనీ.. ప్రజా క్షేత్రంలో టీఆర్‌ఎస్‌కు బొందపెట్టడం ఖాయమని జోస్యం చెప్పారు.

- Advertisement -

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన పాదయాత్రకు, ప్రజల నుంచి వస్తున్న అద్భుత స్పందన చూసి.. టీఆర్‌ఎస్‌ నేతల వెన్నులో వణుకు మెుదలయ్యిందని పేర్కొన్నారు. ప్రాజెక్టుల పేరిట వేల కోట్లు దండుకున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. స్కామ్‌లకు పెట్టింది పేరు కేసీఆర్‌ కుటుంబం అనీ.. అన్ని స్కామ్‌లలో ఉన్నది కేసీఆర్‌ కుటుంబ సభ్యులేనని దుయ్యబట్టారు. మెున్న ఎమ్మెల్యేల సినిమా అన్నాడు.. ఇప్పుడు కూతురు పేరుతో కొత్త ట్రైలర్‌కు తెర లేపారంటూ కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. బండి సంజయ్‌ పాదయాత్రలో టీఆర్‌ఎస్‌ బండారాన్ని బయట పెడుతుండటంతో.. కేసీఆర్‌ నిజ స్వరూపం ప్రజలకు తెలుస్తుందన్నారు. ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో.. టీఆర్‌ఎస్‌ నేతల పీఠాలు కదిలిపోతున్నాయని ఎన్వీ సుభాష్‌ (NV Subhash) అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...