Secret Love: వారు ఇలా చేస్తుంటే.. మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లే!

-

Secret Love knowing tips: మీపట్ల ఒకరు అమితమైన ప్రేమతో ఉన్నారు అని చెప్పటానికి ఈ ఒక్క లక్షణం చాలు అంటారు మానసిక నిపుణులు. మీరు దగ్గర ఉన్నప్పుడు, మీ పట్ల ఆకర్షితులవుతున్న వ్యక్తి, లేదా ప్రేమిస్తున్న వ్యక్తి కొంచెం నర్వెస్‌గా కనిపిస్తారంట. ఎందుకంటే, తాము ప్రేమించే వ్యక్తులు వారికి దగ్గరికి వస్తే.. వారి గుండె కొట్టుకునే వేగం పెరిగిపోతుంది. వారికి తెలియకుండానే చిన్నగా వణుకు మెుదలవుతుంది. మీరు దూరంగా ఉన్నప్పుడు దగ్గరికి రావాలని అనుకుంటారు. తీరా దగ్గరికి వచ్చాక నర్వెస్‌ అయిపోయి మాట్లాడలేరు. మాట్లాడాల్సి వస్తే.. మాటలు తడబడుతూ, పదాలు మర్చిపోతారట.

- Advertisement -

నవ్వు
మిమ్మల్ని చూడగానే మనస్ఫూర్తిగా నవ్వుతారు. ప్రేమను వ్యక్తపరచటం, గౌరవాన్ని తెలిపే సాధారణ చర్య నవ్వు. కానీ ఒకరు మిమ్మల్ని చూసి నవ్వారంటే.. ఏ కారణంతోనే నవ్వారన్నది ఇట్టే తెలిసిపోతుంది. ఇష్టం, ప్రేమను చూపే వారి నవ్వు కొద్దిగా వేరుగా ఉంటుందని.. నకిలీ నవ్వుకు, ప్రేమ పూర్వక నవ్వుకు తేడా కనిపెట్టడానికి నిపుణులే కావాల్సిన అవసరం లేదంటున్నారు రిలేషన్‌ షిప్‌ నిపుణులు.

మీ గురించే వెతుకుతారు
మీరు ఏదైనా గుంపులో ఉంటే.. మీ గురించే వెతుకుతారు. మీరు కనిపించగానే వారిలో ఒక రకమైన రిలీఫ్‌ ఫీలింగ్‌ కనిపిస్తుంది. ఎప్పుడూ మీరు భద్రంగా ఉండాలని కోరుకుంటారు. మిమ్మల్ని నీడలా అబ్జర్వ్‌ చేస్తూ, మీ ప్రతి పనిని గమనిస్తూ ఉంటారు. మీ ఇష్టాఇష్టాలను తెలుసుకుంటారు. ఏదైనా హోటల్‌ లేదా రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు, మీకు నచ్చిన వాటికే ప్రిఫరెన్స్‌ ఇస్తారు. మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసేలా, సర్‌ప్రైజులు ఇస్తుంటారు.

ముఖం చూస్తూనే ఉంటారు
ఎవరైనా మీ పట్ల ఆకర్షితులవుతున్నారని చెప్పటానికి ప్రధాన సంకేంత.. వారి కళ్లు, మీ ముఖమంతా స్కాన్‌ చేయటమంటారు మానసిక నిపుణులు. మీరు ఏదైనా విషయం చెప్పేటప్పుడు మీ వైపే కళ్లార్పకుండా చూస్తుంటారు. కళ్లు, పెదవులు, జుట్టు, పెదవులు స్కాన్‌ చేస్తూ ఉంటారు. మీ వైపు చూస్తేనే, కళ్లతోనే ఆరాధిస్తారంట. ఒకవేళ మిమ్మల్ని గమనించేటప్పుడు, మీరు అవతలి వ్యక్తి ముఖం వైపు చూస్తే.. నర్వెస్‌గా ఫీల్‌ అయ్యి.. మాట్లాడటానికే భయపడతారంట.

ఇలా చేస్తే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లే
దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. మీతో ఇంకెవరైనా దగ్గరవ్వటానికి ప్రయత్నించటం, మీరు మరొకరితో సన్నిహితంగా ఉండటం అస్సలు తట్టుకోలేరంట. మీతో ఎప్పుడూ దగ్గరగా ఉండేందుకే ప్రయత్నిస్తూ ఉంటారంట. వారు మిమ్మల్ని వారి ముఖానికి దగ్గరగా అనుమతించినట్లు అయితే.. లేదా మీ సన్నిహత ప్రాంతానికి దగ్గరగా వస్తున్నట్లయితే.. అది మీకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లే.

మిమ్మల్ని సీక్రెట్‌గా ఎవరైనా లవ్‌ (Secret Love) చేస్తున్నారనటానికి ఈ లక్షణాలే నిదర్శనాలంట. మరి మిమ్మల్ని ఎవరైనా మూగగా ఆరాధిస్తున్నారేమో.. తెలుసుకోండి. ఎంతమంది మీ పట్ల ప్రేమ ఉండీ, చెప్పలేకపోతున్నారో ఒక్కసారి చెక్‌ చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...