Supreme court says that Hetero group of companies should faces CBI investigation: ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో తమపై దాఖలైన కేసును కొట్టివేయాలని సుప్రీంను ఆశ్రయించిన హెటిరో గ్రూప్‌కు భారీ షాక్ తగలింది. ఈ కేసులో హెటిరో కంపెనీ విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కాగా, వైయస్ జగన్ అక్రమాస్తుల కేసుల్లో, తమపై దాఖలైన కేసు క్వాష్ చేయాలని హెటిరో సంస్థ సుప్రీం మెట్లెక్కింది. తాజాగా హెటిరో (Hetero) పిటిషన్‌పై విచారణ చేసిన సుప్రీం.. సీబీఐ పక్కాగా ఛార్జీషీటు దాఖలు చేసిందని తెలిపింది.
ఇవన్నీ దాచేస్తే.. దాగని సత్యాలని అత్యన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో హెటిరో విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీం తేల్చి చెప్పింది. కాగా, గతేడాది ఈ కేసులో హెటిరోను తొలగించాలన్న పిటిషన్‌ను తెలంగాణ కోర్టు కొట్టేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ హెటిరో సుప్రీంను ఆశ్రయించింది. ఇక్కడ కూడా హెటిరోకు చుక్కెదురు కావటంతో.. సీబీఐ విచారణ ఎదుర్కోవాల్సిందే.