Mereena eliminate from telugu Bigboss Season 6: ఇది బిగ్‌బాస్ ఏమైనా జరగొచ్చు అని చెప్పిందే నిజమేనేమో.. ఈ వారం కచ్చితంగా శ్రీసత్య బిగ్‌బాస్ ఇంటిని వదిలి బయటకు వచ్చేస్తుందని ప్రేక్షకులందరూ అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా మెరీనా బయటకు వచ్చేసినట్లు లీకులు వినిపిస్తున్నాయి. నిజానికి మెరీనా కంటే శ్రీసత్యకు తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ.. సింపతీ కోసం, టీఆర్పీ కోసం మెరీనాను బయటకు పంపించేశారట. ఇప్పటి వరకూ హౌస్‌లో జంటగా ఉన్న రోహిత్-మెరీనాలను విడగొట్టి.. మెరీనాను ఎలిమినేట్ చేస్తే.. ఆడియన్స్ గేమ్‌కు కనెక్ట్ అవుతారని బిగ్‌బాస్ టీమ్ ప్లాన్ వేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేగాకుండా వచ్చే రెండు వారాలు బిగ్‌బాస్ (Telugu Bigboss Season 6)కు మంచి టీఆర్పీ వచ్చే ఎపిసోడ్లు ఉన్నాయి. ఇన్ని రోజులు ఫ్యామిలీకు దూరంగా ఉన్న బిగ్‌బాస్ ఇంటి సభ్యులు.. తమ కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఇస్తారు. అయితే, ఈ ఎపిసోడ్‌కు ఈ సత్య వాళ్ల అమ్మ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆమె వీల్‌ఛైర్‌కే పరిమిత అయ్యి ఉండటం, అటువంటి వారిని హౌస్‌లోకి తీసుకొని వస్తే.. షోకి ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రేటింగ్ లేక చతికలబడిన బిగ్‌బాస్ షోను.. కనీసం చివరిలోనైనా.. పైకి ఎత్తాలని చూస్తున్నారు. అందుకే శ్రీసత్యను సేవ్ చేసి.. మెరీనాను బయటకు పంపించేశారని టాక్ వినిపిస్తోంది.