Telugu Love Tips: ప్రేమిస్తున్నారా.. ఉన్మాదులతో జాగ్రత్తపడండి..!

-

Telugu Love Tips to avoid Over Reaction in Love: మేమిద్దరం అమర ప్రేమికులం.. మా ఇద్దరికి.. మేము మాత్రమే ముఖ్యం.. మా లోకం మా ఇద్దరమే అంటూ ప్రేమలో మునిగి తేలుతున్నారా? అయితే కొన్ని మార్పులకు అలవాటుపడకపోతే.. బాధపడే అవకాశాలు ఉన్నాయి. అదేంటి ప్రేమిస్తే బాధ ఏమిటి అంతా ఉత్తి ట్రాష్‌ అని కొన్ని పారేయకండి. ప్రస్తుత రోజుల్లో ప్రేమ కాస్తా.. ఉన్మాదంగా మారుతుంది. మీరు ఎవరితోనైనా చనువుగా మాట్లాడినా, మీ తల్లిదండ్రులతోనే మాట్లాడినా తట్టుకోలేక పోతున్నారు. గొడవలు, మనస్పర్థలు రావటం.. చివరికి అది బ్రేకప్‌గా అవుతుందో.. మీ వివరాలతో ఉన్మాదానికి బలైన ప్రేమ అని పేపర్లలలో, న్యూస్‌ ఛానల్‌లోని వస్తోందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రేమ కాస్తా ఇలా విపరీత బుద్ధిగా మారకుండా ఉండాలంటే.. ఈ (Telugu Love Tips) మార్పులను అలువాటు చేయండి. మరి ఆ మార్పులు ఏంటో, తెలుసుకుందాం రండి

- Advertisement -

నువ్వే నా లోకం అన్నట్లు ఉండకండి
నువ్వే నా లోకం, నా సర్వం అంటూ ఎప్పుడూ చెప్పకండి. తల్లిదండ్రులతో పాటూ నువ్వు నాకిష్టం అని చెప్తూ ఉండండి. మీ ప్రేమ బంధం కాస్తా, వివాహ బంధం వరకు తీసుకువెళ్దామని అనుకుంటే.. కచ్చితంగా ఇరువరి తల్లిదండ్రులను ఒప్పించే పెళ్లి చేసుకుందాం అని స్పష్టం చేసేయండి. పెళ్లి అనేది చాలా పెద్ద బాధ్యత కాబట్టి.. నిబ్బానిబ్బీల్లాగా బిహేవ్‌ చేయకండి.. బీ మెచ్యూర్డ్‌.

కాల్స్‌, మెసేజ్‌లకు రిప్లై ఇవ్వకపోతే?
మెుబైల్‌ ఫోన్‌ అందుబాటులోకి వచ్చాక.. తిన్నావా రా.. అంటూ నిమిషానికో ఫోన్‌.. ఏం చేస్తున్నావ్‌ బంగారం అంటూ సెకనుకో వాట్సాప్‌ మెసేజ్‌లు పరిపాటిగా మారిపోయాయి. అవతలి వారు ఏదో పనిలో ఉండో, లేదా ఏ వాష్‌రూమ్‌కో వెళ్లి.. ఆ మెసేజ్‌లకు రిప్లై ఇవ్వకపోయినా, ఫోన్‌ చేసినా ఎటైన్‌ చేయకపోయినా.. కంగారు పడిపోకండి. ఏ పనిలో ఉన్నారో అని అవతలి వారి కోణంలో కూడా ఆలోచించండి. అంతేగానీ.. పనిగట్టుకొని, ఫోన్‌ ఎత్తే వరకు వాయిస్తూ ఉండకండి. దీని వల్ల అవతలి వారికి మీపై ఓ రకమైన అభద్రతాభావం ఏర్పడుతుంది.

అసాధారణంగా ప్రవర్తిస్తున్నారా?
మిమ్మల్ని కేవలం తనతోనే మాట్లాడాలనీ.. ఫ్రెండ్స్‌తో కూడా కలవనివ్వటం లేదా? తల్లిదండ్రులతో మాట్లడినా కోప్పడుతున్నారా? అయితే మీ ప్రేమ బంధాన్ని ఒక్కసారి చెక్‌ చేసుకోవాల్సిందే. మీ పట్ల ఓవర్‌ రియాక్ట్‌ కావటం, చిన్నచిన్న తప్పులకే పెద్దపెద్దగా అరవటం, చేయి చేసుకోవటం వంటివి చేస్తుంటే, మీ ప్రమ బంధంపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని గుర్తు చేసుకోండి. వీరే ప్రేమోన్మాదులుగా మారే అవకాశం ఉంటుంది. లేదు, కాదు నేను మార్చుకోగలను.. నా ప్రేమతో నేను వారిని మామూలు మనిషిగా చేయగలను అనే ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ఉండకండి. పరిస్థితిని మీరు నమ్మే ఫ్రెండ్‌, లేదా తల్లిదండ్రులకు అర్థం అయ్యే విధంగా చెప్పేయండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...