Mlas Purchase case High court key Comments: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఎక్కడ అని ప్రశ్నించింది. కాగా.. సిట్ విచారణ పారదర్శకంగా జరుగుతుందని ఏజీ వివరించారు. బీజేపీ నేత బీఎల్ సంతోష్‌కు నోటీసు ఇచ్చేందుకు ఈనెల 16 నుంచి ప్రయత్నించామని.. చివరకు ఢిల్లీ పోలీసుల సాయంతో బీజేపీ ఆఫీసులో నోటీసులు అందించినట్లు ఏజీ కోర్టులో తెలిపారు. అయితే.. సిట్ ముందు హాజరయ్యేందుకు బీఎల్ సంతోష్ గడువు కోరుతున్నారా? అని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. విచారణకు సంతోష్, తుషార్, జగ్గుస్వామి సహకరించడం లేదని, తదుపరి చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని ఏజీ కోరారు. కాగా బీఎల్ సంతోష్ చట్టాన్ని ఉల్లంఘించలేదని.. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. కాగా సుప్రీం కోర్టు ఉత్తర్వులు చూశాకే (Mlas Purchase case) విచారణ జరుపుతామని హైకోర్టు వెల్లడించింది.