Hero Abbas leg opaterion: తొలి సినిమాతోనే సంచలనం సృష్టించి, సూపర్ డూపర్ హిట్‌తో ఇండస్ట్రీలో ఒక వెలుగాడా హీరో. అలనాటి లవర్ బాయ్‌గా, అమ్మాయిలందరూ రాకుమారుడిలా చూసేవారు.. అతడిలాంటి లవర్ ఉంటే చాలనుకునేవారు. అతడు వేసుకున్న బట్టల నుంచి.. హెయిర్ స్టైల్ వరకు.. ప్రతీదీ ఒక సంచలనమే అప్పట్లో.. అటువంటిది ఉన్నఫలంగా సినిమా రంగానికి గుడ్‌బై చెప్పేసి.. రంగుల ప్రపంచానికి దూరంగా బతుకుతున్నాడు. ఇప్పటికే అర్థం అయ్యి ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో.. అతనేనండి అలనాటి లవర్ బాయ్ (Hero Abbas) అబ్బాస్ గురించి.
కొన్నేళ్లుగా నటనకు దూరమైన అబ్బాస్.. హాస్పిటల్ బెడ్‌పై కనిపించటంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. అసలు అబ్బాస్‌కు ఏమైందంటూ తెగ ఆందోళన చెందుతున్నారు. తమ ఫేవరేట్ హీరోకి ఏమయ్యిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆరా తీయటం మెుదలుపెట్టారు. అబ్బాస్ ఆగస్టులో న్యూజిలాండ్‌లో బైక్‌పై నుంచి కిందపడటంతో.. కుడి కాలికి తీవ్ర గాయమయ్యింది. కొన్నాళ్లు మెడిసిన్ వాడినా.. ఈ నెల 18న వైద్యలు కాలికి శాస్త్ర చికిత్స చేశారు. అనంతరం ఆ ఫోటోను స్వయంగా అబ్బాస్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది.
ఆసుపత్రిలో ఉన్నంతసేపు చాలా ఇబ్బందిగా ఉండేది. నా భయాన్ని అధిగమించి, ధైర్యం తెచ్చుకున్నా.. నేను ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు అని అబ్బాస్ ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు. తొలి సినిమా ప్రేమదేశంతో సూపర్ హిట్ కొట్టి అటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ పరిశ్రమలో వరుస అవకాశాలతో బిజీ అయిపోయారు. అనంతరం అనూహ్యంగా 2015లో నటనకు గుడ్‌బై చెప్పేసి.. న్యూజిలాండ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడిపోయారు.