Komati Reddy Rajagopal Reddy Tweet To Minister Ktr And Kcr: తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రెకేత్తించింది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రేస్ నేతలు మునుగోడు ప్రజలకు హమీలు ఇచ్చారు. టీఆర్ఎస్ను గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ ప్రకటించి, చౌటుప్పుల్ మండలం దండుమల్కాపురం ఇండ్రస్టియల్ పార్కులో ఇండ్లు కోల్పోయిన 450 మందికి తక్షణమే ఇళ్లా స్థలాలు ఇప్పిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఉపఎన్నిక ఫలితాలు వచ్చి 18 రోజులు దాటింది. దీంతో సీఎం, మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.‘‘ఎక్కడున్నారు KCR గారు? ఈ హామీలు కూడా గాలికి కొట్టుకు పోయినట్టేనా?.. దత్తత మాట ఎత్తట్లేదు ఏంటి KTR గారు?’’ అని నిలదీశారు.
ఎక్కడున్నారు కెసిఆర్ గారు? ఈ హామీలు కూడా గాలికి కొట్టుకు పోయినట్టేనా?
దత్తత మాట ఎత్తట్లేదు ఏంటి @ktrtrs గారు? pic.twitter.com/8PSbpdPUlg
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) November 25, 2022