Guthi Koyas Dens In Forest Officials Seized Heavy Weapons: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోడు భూమి విషయంలో వాగ్వాదం తలెత్తడంతో గుత్తికోయలు ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్‌పై వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలో ఆపరేషన్ వెపన్స్ పేరుతో జిల్లా అటవీ అధికారులు గుత్తి కోయల గూడాల్లో భారీగా సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లొ అటవీ అధికారులు భారీగా విల్లంబులు, బల్లెలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అటవీ అధికారులు మాట్లాడుతూ.. విధుల్లో ఉన్న అధికారులు అడవిలోకి వెళితే.. కోయలు తమను చంపాడానికి వెనకాడటం లేదన్నారు. బాణాలకు విషపూరిత ఆకు పసరు పూసి తమ పై దాడి చేస్తున్నారని.. దీంతో వెంటనే చనిపోయే ప్రమాదం ఉందని వివరించారు. గుత్తి కోయలు వారి వెంట మారణాయుదాలు తీసుకువచ్చి అటవీ సిబ్బంది భయపడుతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు.