Chalo Raj Bhavan: ఉద్రిక్తంగా చలో రాజ్‌భవన్‌.. రైతుల సంఘాలకు, పోలీసుల మధ్య తోపులాట

-

Chalo Rajbhavan protest at Khiratabad metro station: తెలంగాణలో రైతు సంఘాల చేపట్టిన చలో రాజ్‌ భవన్‌ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. రైతుల సమస్యలపై చలో రాజ్‌ భవన్‌ కార్యక్రమాన్ని ఆదివాసీ అటవీ హక్కుల పరిరక్షణ కోసం సంయుక్త కిసాన్‌ మోర్చా, సమన్వయ కమిటీ నేతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్‌ సర్కిల్‌లో రైతు సంఘాల ఆందోళన చేపట్టారు. రాజ్‌ భవన్‌ (Chalo Raj Bhavan) కు వెళ్లకుండా.. పోలీసులు అడ్డుకోవటంతో, ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో, రైతు సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ నుంచి నేతలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా.. పలువురు రైతు సంఘాల నేతలు రాజ్‌భవన్‌కు చేరుకొని, లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని సైతం అక్కడ ఉన్న పోలీసులు అడ్డగించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు సంఘాల నేతలు ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌లోనే బైఠాయించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...