Man loses tongue to snake bite: జ్యోతిష్యుడు మాట నమ్మాడు.. నాలుక కోల్పోయాడు!

-

Man loses tongue to snake bite at Tamilnadu: ఓ జ్యోతిష్యుడు, పూజరి చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి.. చివరికి నాలుక కోల్పోయిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఓ వ్యక్తికి కలలో తరుచూగా పాము కాటేస్తున్నట్లు కలలు వస్తుండటంతో.. పూజారిని కలిశాడు. సదరు పూజారి పాముకు పూజ చేసి.. నాలుకను పాముకు చూపించమని సూచించాడు. పాముకు ప్రత్యేక పూజలు చేసిన ఆ వ్యక్తి, అనంతరం పాముకు నాలుకను చూపించాడు. ఇంకేంముంది.. నాలుకపై పాము (snake) కాటేయటంతో.. ఆసుపత్రి పాలయ్యాడు. అతడిని రక్షించటం కోసం మరొక దారిలేక నాలుకను తొలగించారు డాక్టర్లు.

- Advertisement -

వివరాల్లోకి వెళ్తే, తమిళనాడు రాష్ట్రం, ఈరోడ్‌ జిల్లా గోబిచెట్టియపాలెంకు చెందిన ఓ 54 ఏళ్ల వ్యక్తికి తరచుగా పాము తనను కాటు వేస్తున్నట్లు కలలు వస్తున్నాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆ వ్యక్తి.. ఓ జ్యోతిష్యుడిని కలిసి, తన కల గురించి వివరించాడు. పాము సంచరించే ఆలయానికి వెళ్లి, పూజలు చేస్తే మంచిదని జ్యోతిష్యుడు సూచించాడు. దీంతో ఆ వ్యక్తి, ఓ ఆలయం వద్దకు వెళ్లి.. అక్కడే ఉన్న పాముకు ప్రత్యేక పూజలు చేశాడు. పూజకు మరింత పవిత్రత చేకూరాలంటే, పాముకు నీ నాలుక (tongue) చూపించాలని ఆ ఆలయ పూజారి సలహా ఇవ్వటంతో, సదరు వ్యక్తి అదేవిధంగా చేశాడు.

దీంతో ఆ పాము అతడి నాలుకపై కాటు (snake bite) వేసింది. పాము విషం నశాళానికి ఎక్కటంతో, అక్కిడక్కడే కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు, అతడి బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పాము విషం కారణంగా బాధితుడి నాలుక టిష్యూస్‌ ఎఫెక్ట్‌ కావటంతో.. అతడి ప్రాణాలు రక్షించటం కోసం నాలుకను తీసేయాల్సి వచ్చిందని ఈరోడ్‌ మానియన్‌ మెడికల్‌ సెంటర్‌ చీఫ్‌ డాక్టర్‌ సెంథిల్‌ కుమార్‌ వెల్లడించారు. నాలుకను తొలగించనప్పటికీ, (Man loses tongue to snake bite) బాధితుడి ప్రాణాలను కాపాడటానికి నాలుగు రోజులు కష్టపడినట్లు డాక్టర్‌ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...