PT Usha : భారత ఒలంపిక్‌ అధ్యక్షురాలిగా పీటీ ఉష

-

PT Usha was unanimously elected as the President of the Indian Olympic Association: పరుగుల రాణి పీటీ ఉష భారత ఒలంపిక్‌ సంఘం అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి వచ్చే నెల 10న ఎన్నికలు జరగాల్సి ఉండగా, నామినేషన్ల గడువు ఆదివారంతో ముగిసింది. కాగా, ఉషకు పోటీగా ఇతరులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో ఉష ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సంఘం సభ్యులు ప్రకటించారు. తన పరుగులతో ఎన్నో రికార్డులు నెలకొల్పి, మరెన్నో రికార్డులను బద్దలు కొట్టిన ఉష, భారత ఒలంపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా మరొక రికార్డును నెలకొల్పింది. ఆసియా క్రీడల్లో 14 స్వర్ణాలు, 23 ఇతర పతకాలను గెలిచి పలు రికార్డులు నెలకొలిపింది ఉష. ఒక అథ్లెట్‌గా క్రీడా రంగంలో తనకంటూ ఓ పేజీని లిఖించుకుంది పీటీ ఉష.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...