Seediri Appalaraju: ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు.. మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు

-

Seediri Appalaraju comments on elections: శ్రీకాకుళం జిల్లా పలాసలో నూతనంగా నిర్మించిన తన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చుననీ.. కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు, నాయకులు సమైక్యతతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఇష్టానుసారంగా కొందరు లేనిపోనివి మన మీద రాస్తున్నారనీ.. బొచ్చుడు రాసుకున్నా ఫర్వాలేదు అంటూ వ్యాఖ్యానించారు. మీ అండ ఉన్నంత వరకూ నా వెంట్రుక కూడా పీకలేరంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. సీఎం జగన్మోహన్‌ రెడ్డి బతికి ఉన్నంతకాలం ఆయనే ముఖ్యమంత్రి అని జోస్యం చెప్పారు. ప్రస్తుతం మనం ఎన్నికల ప్రచారంలోనే ఉన్నామనీ.. అన్నింటికీ సిద్ధంగా ఉండాలని మంత్రి సీదిరి అప్పలరాజు సూచించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | చిన్న కొడుకుకి అగ్నిప్రమాదం… సింగపూర్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్...

LEAP Model | ఏపీ విద్యా వ్యవస్థలో మార్పులు… కొత్తగా LEAP మోడల్

LEAP Model | ఏపీ సర్కార్ ఈ నెలలో ఎడ్యుకేషన్ మోడల్...