CM Jagan Kadapa Tour :నేడు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన

-

CM Jagan Kadapa Tour in December 2,3 Dates: సీఎం జగన్‌ వైయస్ఆర్ జిల్లాలో నేడు,రేపు పర్యటించనున్నారు. ఈ పర్యటన లింగాల, పులివెందుల, ఇడుపులపాయ ప్రాంతాల్లో జరగనుంది. ఈ రోజు ఉదయం సీఎం జగన్‌ తాడేపల్లిలోని తన నివాసం నుంచి 10.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం 11.15 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు అక్కడి నుంచి 11.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి 11.50 గంటలకు లింగాల మండలంలోని సీబీఆర్‌ రిజర్వాయర్‌ వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.00 గంటలకు అక్కడ బోటింగ్‌ జెట్టిని స్టార్ట్ చేస్తారు. అనంతరం 12.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి వైయస్ఆర్ లేక్‌ వ్యూ పాయింట్‌కు 12.40 గంటలకు చేరుకుంటారు. అనంతరం వైయస్ఆర్ లేక్‌ వ్యూ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తారు. తర్వాత 1.30 నుంచి 4.30 గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. ఇక 4.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5.00 గంటలకు హెలికాఫ్టర్‌లో ఇడుపులపాయ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్‌ లో రాత్రికి బస చేస్తారు.

- Advertisement -

– డిసెంబర్‌ 3 షెడ్యూల్ (CM Jagan Kadapa Tour)
డిసెంబర్‌ 3న ఉదయం 8.30 గంటలకు వైయస్ఆర్ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి 8.35 గంటలకు హెలిప్యాడ్‌‌‌లో పులివెందుల భాకరాపురంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం 9.00 గంటలకు రోడ్డు మార్గాన కదిరిరోడ్డులోని ఎస్‌సీఎస్‌ఆర్‌ గార్డెన్స్‌కు చేరుకొని.. 9.15 నుంచి 9.30 గంటల వరకు సీఎం వ్యక్తిగత కార్యదర్శి డి.రవిశేఖర్‌ కుమార్తె వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం 9.45 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి 10.10 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 10.15 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని 11.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి సీఎం జగన్‌ చేరుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...