Two lorries collided and four died: కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ధర్మవరం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి చెందారు. లారీ అదుపుతప్పడంతో డివైడర్‌ను ఢీకొని మరో లారీని ఢీకొట్టింది. రెండు లారీలు ఢీకొనడంతో క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన రాజమండ్రి నుంచి విశాఖపట్నంకు ఇసుక లోడును లారీ తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలికి మంటలార్పుతున్నారు. కాగా.. ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సజీవ దహనం అయ్యారు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.