Covid will again break out in many countries as well as in India: కరోనా మహమ్మారి ప్రపంచ దేశలను ఎలా భయపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంటికి కనిపించని ఈ వైరస్ ప్రపంచంలోని ప్రజల ఆరోగ్యాలనే కాదు.. ఆర్థిక వ్యవస్థలను కూడా నాశనం చేసింది. తగ్గుతుందని అనుకున్న కొవిడ్ బారి నుంచి క్రమంగా ఒక్కో దేశం కోలుకుంటుండగా.. చైనాలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా మారుతున్నాయి. ఇప్పటికీ కఠిన నియమాలతో లాక్‌డౌన్‌లు పాటిస్తున్నారు.
ఎన్ని నిబంధనలు పెట్టినా, ఎంత కఠినంగా లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్నా, కరోనా వ్యాప్తి మాత్రం అదుపులోకి రావటం లేదు. (Covid will again break out) కరోనాను కట్టడి చేసేందుకు చైనా అనేక ఆంక్షలను అమలు చేస్తోంది. చైనా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ అంక్షలకు అక్కడి ప్రజలు విసుగెత్తిపోతున్నారు. కానీ.. కరోనా మహామ్మారి మాత్రం అదుపు కావడంలేదు. దీంతో ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలు నిరసనలు చేస్తున్నారు. ఈ నిరసనలు తీవ్రతరం అవడంతో అధికారులు తమ వ్యూహాన్ని మార్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. క్వారంటైన్‌కు బదులు హోం ఐసోలేషన్లో ఉండాలని సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బ్రిటన్ పరిశోధకులు తాజాగా ఓ విషయాన్ని గుర్తించారు. ఊబకాయంతో బాధపడుతున్న మహిళలను లాంగ్ కొవిడ్ ఎక్కువగా ఇబ్బందిపెట్టే ముప్పు అధికంగా ఉంటుందని వెల్లడించారు. పురుషులతో పోలిస్తే స్త్రీలలో దీర్ఘకాలిక కొవిడ్ లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలున్నాయని నిర్ధారించారు. అయితే.. కరోనా బారినపడ్డ వారిలో దగ్గు, తలనొప్పి, అలసట, శ్వాస సంబంధిత సమస్యలు, ఛాతినొప్పి వంటివి 12 వారాల కంటే ఎక్కువ కాలం పాటు కొనసాగడాన్ని లాంగ్ కొవిడ్ (Long COVID) గా పరిశోధకులు పేర్కొన్నారు. అయితే.. దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కరోనా కేసులు నామోదు అవుతునే ఉన్నాయి. కాగా.. తెలంగాణ ప్రభుత్వం గురువారం నిర్వహించిన 5,867 కరోనా నిర్ధారణ పరీక్షల్లో 16 పాజిటివ్ కేసులు నమోదయినట్లు వైద్యధికారులు వెల్లడించారు.