School student died in road accident in chevella: రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. స్కూల్‌కు వెళ్తున్న విద్యార్థులపై టిప్పర్ లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో రిత్విక్ గౌడ్ (7) అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యార్థి చేవెళ్లలోని కృష్ణవేణి స్కూల్ లో 1వ తరగతి చదువుతున్నాడు. మరో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీంతో విద్యార్థి కుటుంబ సభ్యులు రోడ్డుపై ధర్నా చేపట్టారు.
- Advertisement -