నిశ్చితార్థం సమయంలో డాక్టర్ వైశాలి కిడ్నాప్… 100 మంది దాడి చేసి

-

Dental Doctor Kidnap In Adibhatla: సుమారు 100 మంది యువకులు ఒక అమ్మాయిని కిడ్నప్ చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని రాగన్న గూడలో చోటుచేసుకుంది. ఈ ఘటన తుర్కయాంజల్ మున్సిపాలిటీ మన్నెగూడలోని సిరి టౌన్‌షిప్‌లో జరిగింది. డెంటల్ డాక్టర్ గా పనిచేస్తున్న వైశాలిని 100 మందితో కలిసి నవీన్ రెడ్డి కిడ్నాప్ చేసాడని… అతను టీ టైం ఓనర్ అని యువతీ తల్లిదండ్రులు తెలిపారు.

- Advertisement -

తమ కుమార్తెకు  నిశ్చితార్థం జరిగే సమయంలో  ఇంటిపై దాడికి దిగి సీసీ కెమెరాలు, వస్తువులు పూర్తిగా ధ్వంసం చేసారని… ఆ సమయంలో 100 కి కాల్ చేసినా ఎవరు స్పందించలేదని అమ్మాయి బంధువులు ఆరోపించారు. తల్లిదండ్రులతోపాటు బంధువులపైనా దాడి చేసారు. గతంలో ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో నవీన రెడ్డి పై ఫిర్యాదు చేసారు. తమ కూతురిని పెళ్లి చేసుకుంటానని నవీన్ రెడ్డి చెప్పాడని, అతనితో మాట్లాడిన తర్వాత తాము పెళ్లికి అంగీకరించలేదని వైశాలి తల్లి తెలిపారు.

ఘటనాస్థలిని పరిశీలించిన  ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు. కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. దాడి చేసినవారిలో కొందరు హెల్మెట్లు ధరించి, కర్రలు తీసుకుని వచ్చారని.. యాబై నుంచి వంద మందిదాకా వచ్చి వైశాలిని అపహరించారు. తనను తాకవద్దని వైశాలి చెప్పినా యువకులు వినలేదని ఆమె తల్లి చెప్పారు

Read Also: ఈసారి సెంటిమెంట్ వర్కౌట్ కాదు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...