Tamil Actor Hospitalised in Chennai: తమిళ సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ (Sarathkumar) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. డయేరియాతో డిహైడ్రేషన్కు అవ్వడంతో ఆయన్ను కుటుంబసభ్యులు హాస్పిటల్ లో చేర్పించారు. భార్య రాధికా శరత్ కుమార్, ఆయన కూతురు వరలక్ష్మి హాస్పిటల్ కి చేరుకున్నారు. దీని పై హాస్పిటల్ వర్గాలు కానీ.. కుటుంబసభ్యులు కానీ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆందోళనచెందుతున్నారు.