Leaders Visited BRS office in Delhi: సీఎం కేసీఆర్ డిసెంబర్ 14న ఢిల్లీలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, బీపీ పాటిల్ సందర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి జరుగుతున్నట్లే దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని… బిఆర్ఎస్ పార్టీ దేశ ప్రజల శ్రేయస్సు కోసమే ఏర్పడిందని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.
ఈనెల 14 నుండి బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అందుబాటులోకి రానున్నట్లు ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు.. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా బీఆర్ఎస్ స్థాపించామన్నారు. దేశంలో రైతు సంక్షేమ పార్టీ అధికారంలోకి రావాలని ఆ దిశగా దేశ వ్యాప్తంగా బిఆర్ఎస్ ను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు నామా తెలిపారు. పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి కొంతమంది జాతీయ నాయకులూ కూడా హాజరవుతున్నట్లు తెలిపారు.