Telangana Congress Party: రెండు ముక్కలైన కాంగ్రెస్… హైకమాండ్ నిర్ణయం ఏంటి..?

-

Revolt Telangana congress Party seniors against TPCC President Revanth Reddy: పీసీసీ కమిటీల నియామకం తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చు రాజేసింది. రెండు ముక్కలుగా విడిపోయేందుకు దారి తీసినట్లైంది. సీనియర్లు, వలసవాదులు అంటూ పార్టీ నేతలు చేస్తోన్న కామెంట్స్ అంతర్గత కుమ్ములాటను మరోసారి బహిర్గతం చేశాయి.

- Advertisement -

ఇప్పటికే కమిటీల కూర్పును వ్యతిరేకిస్తూ సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క నివాసంలో భేటీ అయిన సీనియర్లు పరోక్షంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం టీ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. ఈ భేటీకి హాజరైన ఉత్తమ్, భట్టి, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మధుయాష్కి గౌడ్ వంటి సీనియర్లు మూకుమ్మడిగా రేవంత్ రెడ్డి వర్గాన్ని టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

కమిటీ కూర్పులోని 108 మందిలో 54 మంది వల నేతలే ఉన్నారని, ఒరిజినల్ కాంగ్రెస్ వారికి అన్యాయం జరుగుతోందని ధ్వజమెత్తారు. బలమైన సీనియర్లను కావాలనే కించపరుస్తున్నారని, ప్రశ్నిస్తే కోవర్టులు అంటూ సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

పుట్టుకతోనే కాంగ్రెస్ తో బంధం ఉన్న మాలాంటివారిని సంప్రదించకుండానే కొత్తగా వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడం సరికాదంటూ సీనియర్లు భగ్గుమంటున్నారు. ఈ విషయాన్ని హైకమాండ్ వద్దనే తేల్చుకుంటామని నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ లో సీనియర్లు ఏకం కావడం ఇదే తొలిసారి. గతంలో అంతర్గత విషయాలపై స్పందించినప్పటికీ తాజాగా రియాక్ట్ అవుతున్న తీరు అందుకు భిన్నంగా ఉంది. నిన్నా మొన్నటి వరకు కమిటీల ఏర్పాటుపై నోరు విప్పని నేతలు ఇవాళ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పేరు ప్రస్తావించకుండానే రేవంత్ రెడ్డి దాడి పెంచడం ఆసక్తిగా మారింది. దీంతో ఒరిజినల్ కాంగ్రెస్ వలసవాదుల కాంగ్రెస్ గా పార్టీలో పరిస్థితి ఏర్పడింది. అన్నాళ్లు తమ పడుతున్న ఆవేదనను సీనియర్లు చెప్పుకు వచ్చారు. పార్టీని వేరే వారికి అప్పగించే కుట్ర జరుగుతోందని ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని ధ్వజమెత్తారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ లో తలెత్తిన అంతర్గత సంక్షోభం ఎటువైపు దారి తీస్తుందనే చర్చ తెరపైకి వస్తోంది. ముఖ్యంగా పార్టీ నేతల మధ్య ఒరిజినల్, వలస వాదులు అంటూ గ్యాప్ లైన్ ఏర్పడటంతో ఈ ఇష్యూను అధిష్టానం ఏ విధంగా హ్యాండిల్ చేయబోతోందనేటి ఉత్కంఠ రేపుతోంది. సీనియర్ల ఆగ్రహం చల్లారాలంటే రేవంత్ ను మార్చడం ఒక్కటే పరిష్కారం అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరగడం సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

రాష్ట్రంలో ఓ వైపు ఎన్నికల హడావుడి మొదలై అధికార బీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష బీజేపీ దూకుడు పెంచాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తుంటే కాంగ్రెస్ లో మాత్రం ఇంకా కుమ్ములాటలు పెరుగుతుండటం సంచలనం అవుతోంది. అయితే కాంగ్రెస్ లో అంతర్గత సంక్షోభం తలెత్తితే అది ఎవరికి అనుకూలం కాబోతోందనే చర్చ తెరపైకి వస్తోంది.

Read Also: రేవంత్ రెడ్డి వైపే అందరి వేళ్లు!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ గెలుపు ప్రాంతీయ పార్టీలే కారణం: కేటీఆర్

మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి సాధించిన ఘన విజయంపై బీఆర్ఎస్ వర్కింగ్...

KTR | ‘కాంగ్రెస్ ఓటమికి రేవంత్ తప్పుడు ప్రచారమే కారణం’

మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).....