Uttam Kumar Reddy: కోవర్టులుగా చిత్రీకరిస్తున్నారు.. పదవుల్లో టీడీపీ వాళ్లే!

-

Uttam Kumar Reddy Sensational Comments On TPCC Committees Posts: కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల జరిగిన కమిటీల కూర్పు పై సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను పీసీసీ గా ఉన్న సమయంలో తనను ఇష్టపడేవారు ఉన్నారు.. ఇష్టపడని వారు ఉన్నారని అన్నారు. కానీ ఎప్పుడు కూడా తనను వ్యతిరేకించిన వారిని అణగతొక్కాలని అనుకోలేదని తెలిపారు. కమిటీల కూర్పు కొంతమందిని అవమానించడానికే జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని రక్షించుకునేందుకు సేవ్ కాంగ్రెస్‌ నినాదంతో ముందుకు వెళ్లనున్నట్టుగా ఉత్తమ్ తెలిపారు. కడవరకు కాంగ్రెస్ తోనే ఉంటానని స్పష్టం చేశారు.

- Advertisement -

ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల్లో ఎక్కువ మంది ఇతర పార్టీ నుంచి వచ్చిన వారు ఉండటం కాంగ్రెస్ పార్టీకి మంచిది  కాదన్నారు ఉత్తమ్( Uttam Kumar Reddy). కాంగ్రెస్ ను రక్షించుకోవడం పార్టీ సీనియర్లపై ఉందన్నారు. హై కమాండ్ కేటాయించిన కమిటీల్లో 108 మందిలో 54 మంది వివిధ పార్టీలలో నుండి వచ్చిన వారే అని గుర్తుచేశారు. అసలైన కాంగ్రెస్ నేతలను కొంతమంది కోవర్టులని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంత హడావిడిగా  33 జిల్లాలో.. 26 డీసీసీ లను ప్రకటించి , 7 మాత్రమే ఆపారో అర్ధం కావట్లేదన్నారు. గెలిచే చోట నియామకం ఎందుకు ఆపారో తెలియదన్నారు. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల్లో.. 50 మందికి పైగా టీడీపీ నుంచి వచ్చినవాళ్లే ఉన్నారని అన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ హైకమాండ్‌ను కలిసి వారి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

Read Also: రెండు ముక్కలైన కాంగ్రెస్… హైకమాండ్ నిర్ణయం ఏంటి..?

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...