Additional responsibilities for 19 drug inspectors In Telangana: తెలంగాణ వ్యాప్తంగా కొద్దిరోజుల క్రితం 10 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు, 51 మంది డ్రగ్ ఇన్స్‌స్పెక్టర్లను (డీఐ లను) బదిలీ చేసింది తెలంగాణ సర్కార్. ఈ నేపథ్యంలో 19 చోట్ల డ్రగ్ఇన్స్స్టెక్టర్ పోస్టుల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న 19 మంది అధికారులకు అడిషనల్ చార్జ్ ఇస్తూ హెల్త్ సెక్రటరీ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సూర్యాపేట్‌లో డ్రగ్ఇన్స్స్పెక్టర్ గా పనిచేస్తున్న జీ. సురేందర్ కు మిర్యాలగూడ డీఐ, జిన్నారంలో డీఐ గా ఉన్న జి. శ్రీకాంత్ కు బొల్లారం–అమీన్ పూర్‌కు, బాలాపూర్ డీఐ వి. రవికుమార్‌కు మహేశ్వరం, శేరిలింగంపల్లి డీఐ ఏ.శైలజ రాణిని రాజేంద్రనగర్‌కు, గండిమైసమ్మ లో డీఐగా ఉన్న ఎం.హేమలతకు మేడ్చల్, బాచుపల్లి డీఐ ఎం. శ్రీ బింధు ప్రశాంత్‌నగర్‌కు, కుత్బుల్లాపూర్డీఐ ఈ. తిరుపతి కు గాజుల రామారం, కాప్రా డీఐ టి. శివతేజకు బాలనగర్, హబ్సిగూడ డీఐ ఇందిరా ప్రియదర్శినికి మేడిపల్లి, మెహదీపట్నం డీఐ పీ. సంతోష్ కు చార్మినార్ , ఖైరతాబాద్ డీఐ వివేకానందకు యూసఫ్ గూడ, మలక్‌పేట్ డీఐ జీ. అనిల్‌కు ముషీరాబాద్, సికింద్రాబాద్ డీఐ బీ. గోవింద్ సింగ్‌కు బేగంపేట్, మహబూబ్ నగర్ డీఐ షేక్ రబియాను నారాయణపేట్, జడ్జర్ల డీఐ ఎండీ. రఫి షేక్ ను గద్వాల, వనపర్తి డీఐ ఏ. రష్మీ కు నాగర్ కర్నూల్, మంచిర్యాల డీఐ టి. చందనకు పెద్దపల్లి, ఆదిలాబాద్ డీఐ ఏ. శ్రీతల నిర్మల్, సిద్ధిపేట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏ. రాజుకు మెదక్ డ్రగ్ ఇన్స్‌స్పెక్టర్‌గా పూర్తి స్థాయిలో అదనపు బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ అధికారులు ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టులతో పాటు కొత్తగా ఇచ్చిన బాధ్యతలనూ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సి ఉంటుందని రిజ్వీ సూచించారు.