రానా ఆరోగ్యం పై నోరు విప్పిన సురేష్ బాబు..!!

రానా ఆరోగ్యం పై నోరు విప్పిన సురేష్ బాబు..!!

0
82

గత కొన్ని రోజులుగా రానా ఆరోగ్యం పై వస్తున్న వదంతులపై నిర్మాత రానా తండ్రి సురేష్ బాబు నోరు విప్పారు.. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన స్పందిస్తూ రానా కు చిన్నప్పటి నుంచి కంటి సమస్య ఉందని , దానికి అప్పట్లోనే చికిత్స చేయించాలని చూసిన , చిన్నతనం లో చికిత్స చేయడం కరెక్టు కాదన్నా డాక్టర్ల సలహాతో వాయిదా వేసుకున్నట్లు వివరించాడు .

ఇటీవల రానా కంటికి శస్త్ర చికిత్స జరిగిందని , శస్త్ర చికిత్స జరిగిన అనంతరం ఎక్కువగా వత్తిడి గురికావడం వల్ల రక్తపోటు (బీపీ ) కూడా వచ్చిందని చెప్పాడు.బీపీ అటాక్ కావడం వల్లే కాసింత రానా నిరసించడాని సురేష్ బాబు చెప్పుకొచ్చాడు . తన కుమారుడికి ఏమి కాలేదన్న ఆయన , త్వరలోనే పాత రానా ను చూస్తారని అంటున్నాడు .

రానా ఆరోగ్య పరిస్థితి పై ఇప్పటికైన సోషల్ మీడియా లో ఊహాగానాలు ఆగుతాయో లేదో చూడాలి మరి . రానా నటించిన హిందీ సినిమా హౌస్ ఫుల్ -4 విడుదలకు రెడీ గా ఉంది .