YCP MP vijaya sai reddy nominated to rajya sabha vice chairman’s panel: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక పదవి దక్కింది. ఆయన రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్ గా నియమితులైనట్టు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కర్ మంగళవారం సభలో ప్రకటించారు.అయితే పది రోజుల క్రితం విజయసాయిరెడ్డిని నియమించినా ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల వలన ఆయన పేరు జాబితాలో కనిపించలేదు. తాజాగా మళ్లీ రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్ గా పీటీ ఉష తో పాటు విజయసాయిరెడ్డి పేరును చైర్మన్ ప్రకటించారు. విజయసాయిరెడ్డికి కీలక పదవి దక్కడంపై వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Vijaya Sai Reddy: YCP ఎంపీ విజయసాయి రెడ్డికి రాజ్యసభ కీలక పదవి
-