Film critic Umair sandhu comments Shruti Haasan: ప్రముఖ సినీ క్రిటిక్ ఉమర్ సంధు హీరోయిన్ శృతిహాసన్, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ, చిరంజీవిలను అంకుల్స్ అని.. శృతిహాసన్ తో వారిద్దరూ ఎంజాయ్ చేస్తున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ కూడా పెట్టారు. శృతిహాసన్ చిరంజీవి జంటగా వాల్తేరు వీరయ్య సినిమా, శృతిహాసన్ బాలకృష్ణ జంటగా వీర నరసింహారెడ్డి సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలకు సంబంధించిన పోస్టర్లను తన పోస్ట్ లో జత చేస్తూ శృతిహాసన్ తో అంకుల్స్ ఎంజాయ్ చేస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ఉమర్ సంధు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఇద్దరు హీరోల అభిమానులు ఉమర్ సంధూపై మండిపడుతున్నారు.
“ Uncles ” are enjoying with #ShrutiHaasan !!!! pic.twitter.com/WyKZhTix2u
— Umair Sandhu (@UmairSandu) December 20, 2022