Argentina considering putting Lionel Messi’s image on banknotes after World Cup glory: ఫుట్ బాల్ ప్రపంచ కప్ అర్జెంటీనా కైవసం చేసుకున్నప్పటి నుంచి టీమ్ కెప్టెన్ లియోనల్ మెస్సీ పేరు మారుమ్రోగుతోంది. మరి కెప్టెన్ గా, ఆటగాడిగా అతను కనబరిచిన ప్రతిభ అలాంటిది. అయితే 35 ఏళ్ల తర్వాత ఫుట్ బాల్ ప్రపంచ కప్ తమ అమ్ముల పొదిలో చేర్చిన కారణంగా అర్జెంటీనా సెంట్రల్ బ్యాంక్ మెస్సీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
తమ దేశ 1000 పెసో (అర్జెంటీనా కరెన్సీ) నోట్లపై మెస్సీ(Lionel Messi) ఫొటోను ముద్రించేందుకు ప్రపోజల్ పంపినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని అర్జెంటీనాకు చెందిన ప్రముఖ దినపత్రిక (ఎల్ ఫినాన్సియరో) ఓ ప్రత్యేక కథనం ద్వారా వెల్లడించింది. ఫిఫా వరల్డ్ కప్ 2022 విజయానికి గుర్తుగా అర్జెంటీనా సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాసుకొచ్చింది. ఫ్రాన్స్ ఫైనల్ మ్యాచ్ కు ముందే బ్యాంక్ అధికారులు దీనికి సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టినట్లు పేర్కొంది.
అయితే, ఈ ప్రచారం అవాస్తవమని ఆ దేశ ఇతర దినపత్రికలు కొట్టిపారేశాయి. కాగా, అర్జెంటీనా 1978లో తొలిసారి వరల్డ్ కప్ గెలిచినప్పుడు దేశ ప్రభుత్వం నాటి ఫుట్ బాల్ ఆటగాళ్లతో కూడిన కొన్ని స్మారక నాణేలను విడుదల చేసింది. తాజాగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అర్జెంటీనా ప్రతిపాదనతో మెస్సీ(Lionel Messi) ఫోటోను కూడా ఆ దేశ కరెన్సీపై ముద్రించాలని విశ్వవ్యాప్తంగా ఉన్న మెస్సీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.