ఆసియాలోనే అతిపెద్ద మెదక్ చర్చ్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

-

Christmas celebrations in Medak Church: తెలుగు రాష్ట్రాల్లో మెదక్ చర్చ్ అత్యంత ప్రసిద్ధిగాంచింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిగా గుర్తింపు కలిగింది. నేడు క్రిస్మస్ సందర్భంగా ఈ చర్చ్ కి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అందులోనూ ఆదివారం కావడంతో పొరుగు రాష్ట్రాల నుండి సైతం వచ్చిన భక్తులతో ప్రాంగణమంతా కోలాహలంగా నిండిపోయింది.

- Advertisement -

రెవరెండ్ బిషప్ సాల్మన్ రాజ్ అధ్వర్యంలో ఉదయం నాలుగు గంటలకు ప్రాతఃకాల ప్రార్థనలతో వేడుకలను ప్రారంభించారు. ప్రత్యేక ప్రార్థన అనంతరం శిలువ ఆరాధన నిర్వహించారు. ఏసు జననం పురస్కరించుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు . లక్షలాదిగా తరలి వచ్చే భక్తుల కోసం అసౌకర్యాలు కలగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

Read Also:

TTD శుభవార్త.. ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఘోర ప్రమాదం.. 10 మంది మృతి, 40 మందికి గాయాలు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Annamalai | నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేను -అన్నామలై

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై(Annamalai) సంచలన ప్రకటన చేశారు. తాను...

CMRL Case | చిక్కుల్లో కేరళ సీఎం కూతురు… పదేళ్లు జైలు శిక్ష తప్పదా?

CMRL Case | కేరళ సీఎం పినరై విజయన్(Pinarayi Vijayan) కూతురు...