వంగవీటి రంగా వర్ధంతి.. టీడీపీ నేతకు చంపుతామంటూ బెదిరింపులు.. పెట్రోలు దాడి

-

Petrol Attack On TDP Ex-MLA Raavi Venkateswara rao in Gudivada: గుడివాడలో హై టెన్షన్ నెలకొంది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు కు ఫోన్ చేసి కొందరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆయన మీడియాతో ప్రస్తావిస్తుండగా కొందరు వ్యక్తులు పెట్రోల్ సంచులతో ఆయనపై దాడికి దిగారు. దీంతో ఆ ప్రాంతంలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. అంతేకాదు ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా పై కూడా కొందరు దాడికి దిగడం సంచలనంగా మారింది.

- Advertisement -

గుడివాడలో మాజీమంత్రి కొడాలి నాని, టిడిపి ఇన్చార్జ్ రాజు వెంకటేశ్వరరావు వర్గాల మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. 2019 నుండి కొనసాగుతున్న ఈ వర్గ పోరు ఇటీవల తారస్థాయికి చేరుకుంది. సోమవారం వంగవీటి రంగా(Vangaveeti Ranga) వర్ధంతి కార్యక్రమాలు రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు సన్నాహాలు చేపట్టారు. వంగవీటి సంస్మరణ కార్యక్రమాలు చేపట్టే అర్హత మీకు లేదంటూ వైసిపి నేతలు వారిపై వివాదానికి దిగారు. రావి వెంకటేశ్వరరావు(Raavi Venkateswara rao)కు వంగవీటి రంగ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తే చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలుస్తోంది. కొడాలి నాని ముఖ్య అనుచరుడు కాళీ అనే వ్యక్తి ఈ బెదిరింపు కాల్స్ చేసినట్టు టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో రావి వెంకటేశ్వరరావుకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులకు, వైసీపీ శ్రేణులకు మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. వైసీపీ శ్రేణులు తమపై పెట్రోల్ సంచులతో దాడి చేశారంటూ టిడిపి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కగా ప్రయత్నం చేస్తున్నారు.

Read Also:

ఏ అమ్మాయితోనైనా రూ.1000కే సెక్స్.. చెన్నై లాడ్జి పబ్లిక్ యాడ్ (వీడియో)

విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. టికెట్స్ పై భారీ తగ్గింపు.. ఈరోజే లాస్ట్

ఈ చిన్న పరిహారంతో సంపద పెరిగి దరిద్రం పరార్… 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట: ఆ అధికారులపై సీఎం సీరియస్ యాక్షన్

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని,...

Mohan Babu | మోహన్ బాబుకి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం

ప్రముఖ నటుడు మోహన్‌బాబు(Mohan Babu)కి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం లభించింది....