భారతదేశపు సుప్రసిద్ధ బ్లాక్‌చైన్ మరియు వెబ్‌ఎకోసిస్టమ్ బిల్డర్, ఐబీసీ మీడియా యొక్క ఆల్ట్ హ్యాక్ 2022 నేడు విజయవంతంగా వైజాగ్‌లో ముగిసింది. వెబ్ 3.0(web 3.0) శక్తిని వినియోగించుకోవడంతో పాటుగా రివార్డింగ్ కెరీర్ కోసం విద్యార్థులను సిద్ధం చేసే వేదికగా ఇది నిలిచింది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు బ్లాక్‌చైన్ మరియు వెబ్ 3.0 లలో దాదాపు 2వేల మందికి కీలకమైన పరిశ్రమ నిపుణులు శిక్షణ అందించడంతో పాటుగా ఫంక్షనల్, టెక్నాలజీ స్టాక్స్‌పై శిక్షణ అందించారు.
Team: క్యూబ్
ఆలోచన: క్రిప్టోకరెన్సీని బహుమతిగా అందించడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్ధాలను బాధ్యతాయుతంగా రీసైకిల్ చేసేలా ప్రోత్సహించడం
Winners: తెన్నేటి హేమబిందు
బలివాడ సాయి కార్తీక్
సత్తి సాయి శ్రీకర ప్రభాస్
Team: ఔట్ ఆఫ్ బౌండ్స్
ఆలోచన: వికేంద్రీకృత ఆన్లైన్ విద్య
Winners: ఎస్ సాయి సుశాంత్
ఎస్ శ్రీ వర్షిత్
సాయి ఉదయ్ కిరణ్
Team: ఆకాష్
ఆలోచన: స్వార్మ్ ట్రూప్స్‌లో స్థిరమైన రీతిలో వికేంద్రీకృత సమాచారం మరియు డాటా నిల్వ
Winners: ఎల్ రామ్ గణేష్
వీ శుభాంకర్
ఎస్ పరిమళ శ్రీ
పరిశ్రమ నిపుణులు మరియు వెబ్3.0(web 3.0) పయనీర్ పోల్కాడాట్ నుంచి 75కు పైగా ఉన్నత విద్యాసంస్ధల విద్యార్ధులు శిక్షణ పొందారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీఐఎస్, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ, టెక్ మహీంద్రా మద్దతు అందించాయి.
ఈ కార్యక్రమ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈఓ టీ అనిల్‌కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, ఐబీసీ మీడియా సీఈఓ–ఫౌండర్ అభిషేక్ పిట్టి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీ అనిల్‌కుమార్ మాట్లాడుతూ ‘‘విద్యార్ధులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు సరైన సమయంలో ఈ కార్యక్రమం వచ్చింది. దీనిద్వారా వెబ్ 3.0 డెవలపర్ల కొరత తీరనుంది. ఈ తరహా కార్యక్రమాలకు ప్రభుత్వం తోడుండటంతో పాటుగా విద్యార్థులకు సహాయపడనుంది’’ అని అన్నారు.
ఈ హ్యాక్‌లో 25 టీమ్‌లకు చెందిన 200 మంది అభ్యర్ధులు తమ ఆలోచనలను న్యాయనిర్ణేతలతో పంచుకున్నారు. ఈ టీమ్‌లకు ఐబీసీ మీడియా మెంటార్లు తగిన మార్గనిర్ధేశనం చేశారు.
ఐబీసీ మీడియా సీఈఓ–ఫౌండర్ అభిషేక్ పిట్టి మాట్లాడుతూ ‘‘ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులపై ప్రభావం చూపాలని మేము భావిస్తున్నాము. అలాగే వాస్తవ ప్రపంచపు సమస్యలకు తగిన పరిష్కారాలను అందించేలా వారి విద్యా అభ్యాసాలకు తగిన పరీక్షలనూ పెడుతున్నాము. వెబ్ 3.0 కోసం భారతదేశాన్ని సిద్ధం చేయాలనేది మా లక్ష్యం’’ అని అన్నారు.