తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ వేడుకలపై కీలక నిర్ణయం!!

-

Telangana Government allows new year Celebrations: కోవిడ్ కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తున్న వేళ న్యూ ఇయర్ వేడుకలకు బ్రేకులు పడే అవకాశం ఉందని అంతా భావించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలకు బ్రేక్ ఉండదని క్లారిటీ వచ్చింది. సెలబ్రేషన్స్ కు ఆంక్షలు విధించే ఆస్కారమే లేదు. ఆంక్షలు విధిస్తున్నట్లు గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి చెక్ పడినట్లయింది.

- Advertisement -

ప్రస్తుతానికి కరోనా ప్రభావం లేనందున సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇతర దేశాల్లో కరోనా విజృంభిస్తోందన్న వార్తలతో అలర్టైన సర్కార్, వైద్యశాఖ, ఇతర ముఖ్య అధికారులతో ఇటీవల ఓ సమావేశాన్ని నిర్వహించింది. కరోనా వ్యాప్తితో న్యూ ఇయర్ ఎఫెక్ట్ అంశంపై సర్కార్ ఆరా తీయగా, ఎలాంటి టెన్షన్ లేదని హెల్త్ డిపార్ట్మెంట్ తేల్చి చెప్పింది. ఇతర దేశాల్లోని పరిస్థితులు మనకు ఎట్టి పరిస్థితుల్లో రావని వైద్యశాఖ స్పష్టం చేసింది. దీంతో కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్(Telangana New Year Celebrations) కి ఆంక్షలు అవసరం లేదని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కానీ వ్యక్తిగత భద్రత కోసం మాస్కులు ధరించి సెలబ్రేషన్స్ లో పాల్గొనాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Read Also:
నల్లటి మచ్చలకు, ముడతలకు చింతపండుతో చెక్ పెట్టండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...