తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. భక్తులకు TTD సమాచారం ఇదే 

-

Tirumala Vaikunta Dwara Darshanam TTD alert for devotees: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు టికెట్లు, టోకెన్లు పొంది తిరుమలకు రావాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ విజ్ఞప్తి చేశారు. తిరుమలలో సోమవారం వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల పరిశీలన అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు ఉంటుందని ఈవో చెప్పారు. ఇందుకోసం ఆన్‌లైన్‌ ద్వారా రూ.300/` ఎస్‌ఇడి టికెట్లు 2 లక్షలు కేటాయించినట్టు తెలిపారు. తిరుపతిలో అలిపిరి వద్దగల భూదేవి కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌ ఎదురుగా గల విష్ణునివాసం, రైల్వేస్టేషన్‌ వెనుక గల 2, 3 సత్రాలు, ఆర్‌టిసి బస్టాండు ఎదురుగా గల శ్రీనివాసం కాంప్లెక్స్‌, ఇందిరా మైదానం, జీవకోన జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, భైరాగిపట్టెడలోని రామానాయుడు మున్సిపల్‌ హైస్కూల్‌, ఎంఆర్‌ పల్లి జడ్‌పి హైస్కూల్‌, రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేస్తున్న కౌంటర్లలో జనవరి ఒకటో తేదీన సర్వదర్శనం టోకెన్ల జారీ  ప్రారంభిస్తామన్నారు.

- Advertisement -

10 రోజుల కోటా పూర్తయ్యేంత వరకు నిరంతరాయంగా టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు తిరుమలలోని కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద రిపోర్టు చేయాలని తెలిపారు. భక్తులు టిటిడి వెబ్‌సైట్‌, ఎస్వీబీసీ, ఇతర మాధ్యమాల ద్వారా టికెట్ల లభ్యతను ముందే తెలుసుకుని తమ తిరుమల ప్రయాణాన్ని ఖరారు చేసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. భక్తులు ముందుగానే వచ్చి క్యూలైన్లలో నిరీక్షించకుండా టోకెన్‌పై తమకు కేటాయించిన ప్రాంతానికి నిర్దేశించిన సమయానికి మాత్రమే రావాలని కోరారు. తిరుమలలో వసతి సౌకర్యం తక్కువగా ఉన్నందున దర్శన టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే ముందు వచ్చిన వారికే ముందు అన్న ప్రాతిపదికపై వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్లు, వైద్యసదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈవో వెంట అదనపు ఈవో(ఎఫ్‌ఏసి) శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్‌,  ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్‌ కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ నాగేశ్వరరావు, ఎస్‌ఇ-2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, ట్రాన్స్ పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి తదితరులు ఉన్నారు.

Read Also:
ఈ చిన్న పరిహారంతో సంపద పెరిగి దరిద్రం పరార్… 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...