Sankranthi Holidays list In Telangana: తెలంగాణలో బతుకమ్మ, దసరా తర్వాత అంతే ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఇతర ఊర్లలో జీవించే వారంతా సంక్రాంతి పండుగ తమ సొంత ఊరిలో జరుపుకోవాలని ఆశిస్తూ ఉంటారు. తమ పిల్లలకు స్కూళ్లకు కాలేజీలకి సెలవులు ఇవ్వగానే ఊర్లకు బయలుదేరుతారు. ఇంక పిల్లలు కూడా సంక్రాంతి సెలవులు ఎప్పుడెప్పుడు వస్తాయా అంటే ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది కూడా సంక్రాంతి సెలవుల లిస్ట్ ప్రకటించింది తెలంగాణ సర్కార్. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఐదు రోజులు ఉండనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకుజనవరి 13 నుండి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. ఇంటర్ కాలేజీలకు కూడా ఇవే సెలవులు వర్తించనున్నాయి.
విద్యార్థులకు Telangana సర్కార్ గుడ్ న్యూస్.. సంక్రాంతి హాలిడేస్ లిస్ట్ ఇదే
-