పుల్లారెడ్డి కోడలికి రాష్ట్రపతి సపోర్ట్.. CS కి కీలక ఆదేశాలిచ్చిన ముర్ము

-

President Draupadi Murmu Responds to Pulla reddy’s Daughter in law Pragna reddy letterr:పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత రాఘవ రెడ్డి కోడలు ప్రజ్ఞా రెడ్డి కోడలు గత కొంతకాలంగా అత్తింటి వేధింపులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనకి, తన బిడ్డకి న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ, న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఆమెకి న్యాయం జరగట్లేదని పోరాడుతూనే ఉన్నారు. చివరికి ఈ వ్యవహారం తెలంగాణ విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరకు వెళ్ళింది. అత్తింటి వారు వేధిస్తున్నారని, తనకి ప్రాణహాని ఉందని, సాటి మహిళగా న్యాయం చేయమంటూ రాష్ట్రపతికి వినతిపత్రం అందజేశారు ప్రజ్ఞా రెడ్డి.

- Advertisement -

రాఘవరెడ్డి తనను చంపేందుకు ప్రయత్నించారని, వరకట్నం కోసం హింసించారని ప్రజ్ఞారెడ్డి ఆమె రాసిన లేఖలో పేర్కొన్నారు. తమను ఇంటి నుంచి బయటకి రాకుండా చేసేందుకు రాత్రికి రాత్రి తన గది బయట గోడ కట్టారని లేఖలో వాపోయారు. ఇవి తాను చేస్తున్న ఆరోపణలు కాదని, ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి గది బయట గోడ కూల్చి వేయమని ఆదేశించారని ప్రజ్ఞ తెలిపారు. తమ హక్కులను కాలరాస్తూ, నన్ను బెదిరిస్తున్న అత్తింటి వారిపై ఇప్పటికే హైదరాబాద్ లో కేసులు నమోదై ఉన్నాయని, సాటి మహిళగా తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని రాష్ట్రపతిని ప్రాధేయపడ్డారు.

ఈ క్రమంలో ప్రజ్ఞారెడ్డి వినతి లేఖపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ప్రజ్ఞారెడ్డిపై వేధింపుల విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ CS కి ఆదేశాలు జారీ చేశారు. దీంతో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రజ్ఞారెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Read Also: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్: రూ.1999 రీచార్జ్‌తో ఏడాదంతా అన్‌లిమిటెడ్ కాల్స్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...