Uzbekistan claims 18 children died after drinking Made in India Doc-1 Max syrup: ఉజ్బెకిస్థాన్ లో దగ్గు సిరప్ వాడడం వల్ల 18 మంది చిన్నారులు మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ లో తయారు చేసిన సిరప్ వాడడం వల్లే చిన్నారులు మరణించినట్లు ఆరోపణలు చేసిన ఉజ్బెకిస్థాన్. Doc-1 Max సిరప్ ఇండియా లోని నోయిడా కి చెందిన మారిన్ బయోటెక్ కి చెందినది గా గుర్తించారు. ఈ ఆరోపణలపై ఇండియా స్పందించి విచారణకు సిద్దమైనట్లు తెలుస్తుంది. డాక్టర్లను సంప్రదించకుండా జలుబు కోసం పిల్లల తల్లిదండ్రులు ఫార్మాసిస్టుల సూచనలతో ఉపయోగించినట్లు పేర్కొన్నారు. అలాగే పిల్లలు హాస్పిటల్లో చేరే ముందు 2-7 రోజుల పాటు 2.5 ml నుండి 5 ml వరకు రోజుకు మూడు, నాలుగు సార్లు ఉపయోగించినట్లు కనుకొన్నారు.
18 మంది పిల్లల మరణం తర్వాత దేశంలోని అన్ని ఫార్మసీ ల నుండి Doc-1 Max సిరప్, టాబ్లెట్ లను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఒక బ్యాచ్ సిరప్‌ల లాబరేటరీ లో పరీక్షించగా విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ ఉనికిని కనుగొన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. నిర్లక్ష్యం వహించి.. సకాలంలో చర్యలు తీసుకోవడంలో విఫలం అయిన ఏడుగురు ఉద్యోగులను తొలగించినట్లు ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.