CM Jagan Expresses Regret Over Kandukur Incident and announces ex-gratia to kin of deceased: ఏపీ సీఎం జగన్ కందుకూరులో జరిగిన దుర్ఘటన పై స్పందించారు. చంద్రబాబు రోడ్ షో లో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోవడం పై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం జగన్. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. రెండు లక్షలు గాయపడిన వారికి రూ. 50 వేలు అందించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
కందుకూరు ప్రమాద ఘటన పై స్పందించిన ఏపీ CM Jagan
-