నితిన్ కి ఆ టైటిల్ నచ్చలేదట.. ఇప్పుడెలా..!!

నితిన్ కి ఆ టైటిల్ నచ్చలేదట.. ఇప్పుడెలా..!!

0
77

సెకండ్ ఇన్నింగ్స్ లో నితిన్ మొదట్లో బాగా రాణించిన గత కొన్ని సినిమాలుగా అంతగా ఆశించిన ఫలితాలు దక్కలేదనే చెప్పాలి.. ప్రస్తుతం వెంకీ కుడుములు దర్శకత్వంలో భీష్మ అనే సినిమాచేస్తున్న నితిన్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమాలకు సిద్ధమవుతున్నాడు..

అయితే ఇందులో యేలేటి సినిమాకి ‘చదరంగం’ అనే టైటిల్ ను ఫిక్స్ అయ్యాడు. సినిమా పి.ఆర్ టీం సహకారంతో అన్నీ మేజర్ మీడియా హౌజ్ లలో ఈ టైటిల్ ను ప్రచురించడం జరిగింది. అయితే.. నితిన్ కి మాత్రం ఈ టైటిల్ నచ్చలేదట.చంద్రశేఖర్ ఏలేటి స్క్రిప్ట్ మీద ఇష్టంతోపాటు.. ఆయనపై గౌరవం కూడా ఉన్నప్పటికీ.. టైటిల్ విషయంలో మాత్రం ఆయనతో ఏకీభవించలేకపోతున్నాడట. కథకి ఆ టైటిల్ సరిపోతున్నా.. వేరే టైటిల్ ఏదైనా ఆలోచించమని చెబుతున్నాడట నితిన్. మరి ఈ టైటిల్ కన్ఫ్యూజన్ ఎప్పటికీ తీరుతుందో చూడాలి.