Telangana Police Recruitment Mains Exam Dates Finalised: తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు TSPLRB కీలక ప్రకటన జారీ చేసింది. ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించిన ఫైనల్ ఎగ్జామ్ డేట్స్ ను ప్రకటించింది. మార్చి 12 2023 నుండి తుది పరీక్షలు ఉంటాయని వెల్లడించింది. ఏప్రిల్ 9న సివిల్ ఎస్సై మెయిన్స్, ఏప్రిల్ 23న అన్ని రకాల కానిస్టేబుల్ పోస్టులకు తుది పరీక్షలు ఉంటాయని తెలిపింది. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 ఉంటుందని తెలిపింది. కాగా, మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకునే తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. ఏదైనా సమాచారం కోసం అభ్యర్థులు TSLPRB వెబ్సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
పోలీస్ అభ్యర్థులకు అలర్ట్: తుది పరీక్షలు అప్పటి నుంచే
-