Malaika Arora: బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా, సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ తమ వివాహ బంధానికి 2017లో విడాకులతో గుడ్ బై చెప్పేశారు. అప్పటి నుండి వీరిద్దరూ సపరేట్ గా ఉంటున్నప్పటికీ.. కొడుకు అర్బాజ్ ఖాన్ కోసం ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటెయిన్ చేస్తున్నారు. కాగా, విడాకుల అనంతరం మలైకా.. అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈమధ్య మలైకా మాజీ భర్తని తరచూ కలవడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలె మలైకా(Malaika Arora), అర్బాజ్ ఓ రెస్టారెంట్ లో డిన్నర్ చేస్తూ క్లోజ్ గా ఉన్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో మరోసారి మీడియాకి అడ్డంగా బుక్కయ్యారు ఈ మాజీ కపుల్. ఒకవైపు అర్జున్ కపూర్ తో ప్రేమాయణం కొనసాగిస్తూనే.. మరోవైపు మాజీ భర్తతో ఎంజాయ్ చేస్తుందంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మలైకా కి డబుల్ ధమాకా అంటూ విమర్శిస్తున్నారు. మరికొందరేమో కేవలం కొడుకు భవిష్యత్తు కోసమే మాజీ భర్తని కలుస్తుందంటూ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.
Malaika Arora: మాజీ భర్తతో తిరుగుతూ అడ్డంగా బుక్కైన స్టార్ యాక్ట్రెస్
-