Satya Nadella: ప్రధాని మోడీతో భేటీ అనంతరం సత్య నాదెళ్ల కీలక ప్రకటన 

-

Microsoft CEO Satya Nadella meets PM Modi: మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల ప్రధాని నరేంద్ర మోడీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రధానితో సమావేశం స్ఫూర్తిదాయకమని, అంతర్దృష్టితో కూడుకున్నదిగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని సత్య నాదెళ్ల(Satya Nadella) ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. డిజిటల్ పరివర్తన ద్వారా నడిచే స్థిరమైన సమ్మిళిత ఆర్థిక వృద్ధిపై ప్రభుత్వం లోతైన దృష్టిని ప్రశంసించారు. ‘డిజిటల్ పరివర్తన ద్వారా సుస్థిరమైన, సమ్మిళిత ఆర్థిక వృద్ధిపై ప్రభుత్వ లోతైన దృష్టిని చూడటం స్ఫూర్తిదాయకంగా ఉంది. డిజిటల్ ఇండియా విజన్‌ను గ్రహించి ప్రపంచానికి వెలుగుగా ఉండటంలో భారతదేశానికి సహాయం చేయడానికి మేము ఎదురుచూస్తున్నాము’ అని నాదెళ్ల ట్వీట్ ద్వారా కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆయన భారత్‌లో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. దీనిలో భాగంగా కస్టమర్లు, స్టార్టప్స్, డెవలపర్స్, విద్యావంతులు, విద్యార్థులు, ఇతర ప్రభుత్వ నేతలతో ఆయన మారథాన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -
Read Also:

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...