రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని జేసీ బ్రదర్స్ కు మరో బిగ్ షాక్ తగిలింది… తాజాగా వారి స్పీడ్ కు జగన్ మెహన్ రెడ్డి సర్కార్ బ్రేకులు వేసింది… మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులను అధికారులు సీజ్ చేశారు… .
ఒకటికాదు రెండు కాదు సుమారు ఎనిమిది బస్సులను సీజ్ చేశారు… ఈ ఎనిమిది బస్సులు నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్నాయనే ఉద్దేశంతో అధికారులు సీజ్ చేశారు.. వీటికి ఎటువంటి అనుమతులు లేవని అధికారులు వెళ్లడించారు…
కాగా జేసీ బ్రదర్స్ రాజకీయ అరంగేట్రం చేసినప్పటినుంచి 2014 ఎన్నికల వరకు ఓటమిని చవి చూడలేదు 2019 ఎన్నికల్లో జగన్ సునామితో ఇటు తాడిపత్రిలో అటు ఎంపీ స్థానానికి పోటీ చేసి అనంతపురంలో తొలిసారి ఓటమిచవి చూశారు…